ఆమ్జెన్ సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

ప్రముఖ బయోటెక్ సంస్థ ఆమ్జెన్ హైదరాబాద్ లో తమ న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించింది.

Advertisement
Update:2025-02-24 12:22 IST

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలో ప్రముఖ బయోటెక్ సంస్థ నూతన అమ్జెన్ కార్యాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు అమెరికాలోని అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ అయిన యామ్‌జెన్ హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ సైట్‌ను ప్రారంభించడం ఆనందనంగా ఉందని అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ ప్రపంచంలోని గొప్ప నగరాలలో ఒకటిగా అత్యంత వేగంగా అవతరించబోతున్నదన్నారు. ఇందులో మీ అందరిని భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నానని కలిసి భవిష్యత్ ను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ లో టాలెంట్ పూల్ ను ప్రారంభించామని హైదరాబాద్ ఎన్నోవేషన్ కు హబ్ గా మారుతుందని చెప్పారు. ఉద్యోగులకు స్కిల్, ఆప్ స్కిల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు

Tags:    
Advertisement

Similar News