తెలంగాణలో త్వరలో బై ఎలక్షన్స్ : ఎంపీ లక్ష్మణ్
తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్
తెలంగాణలో బై ఎలక్షన్లు రాబోతున్నాయని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని పని అయిపోయింది.. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడినవి అంటూ చెప్పుకొచ్చారు. నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. తుమ్మితే ఊడిపోయే ముక్కులా తెలంగాణ, హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి.
రేవంత్ నీ పని అయిపోయింది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. 14 నెలలుగా విద్యార్థుల నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగుల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని రాచి రంపాన పెడుతోంది.రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే ధైర్యమే లేదు. వందేళ్ల కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేకుండా పోయిందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.