గొంగడి షూస్ కి మంత్రి కేటీఆర్ ప్రమోషన్..

ఎర్త్ ఎన్ ట్యూన్స్ అనేది హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ. టీ హబ్ ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. షూస్ తయారీలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

Advertisement
Update:2023-06-25 13:58 IST

చేనేత అంతే కేవలం చీరలు, ఇతర వస్త్రాలు నేయడం మాత్రమే కాదు. చేనేత అనేది చాలా రకాల ఉత్పత్తులకు మూలస్థానం. ఇప్పుడు చేనేత కళాకారులు రూపొందించిన గొంగడి దుప్పట్లతో తెలంగాణలో బూట్లు తయారు చేస్తున్నారు. ఆషామాషీ బూట్లు కాదు, అదిరిపోయే స్టైల్ తో ఉన్న యార్ మోడల్ బూట్లను ఎర్త్ ఎన్ ట్యూన్స్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ షూస్ ప్రత్యేకతను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వివరించారు.


ఎర్త్ ఎన్ ట్యూన్స్ అనేది హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ. టీ హబ్ ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. షూస్ తయారీలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గొంగడి దుప్పట్ల వస్త్రంతో షూస్ తయారు చేస్తోంది. ఈ స్టైలిష్ షూస్ నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. అటు రైతులకు కూడా ఇవి ఉపయోగపడతాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తక్కువ బరువుతో ఉన్న ఈ షూస్ వ్యవసాయ పనుల్లో రైతులకు ఉపయోగకరంగా ఉంటాయని అంటున్నారు. ఎండకు ఎండినా, వానకు తడిచినా వీటి మన్నిక ఏమాత్రం తగ్గదు.

ఎర్త్ ఎన్ ట్యూన్స్ స్టార్టప్ కంపెనీ కేవలం తెలంగాణ పారిశ్రామిక రంగానికే కాదు, అటు చేనేత రంగానికి కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు మంత్రి కేటీఆర్. నారాయణ్ ఖేడ్, జోగిపేట నేత కార్మికులకు ఈ కంపెనీ ద్వారా ఉపాధి లభిస్తోందని తన ట్వీట్ లో పేర్కొన్నారు. గొంగడి చేనేత కార్మికులకు జీవనోపాధి లభిస్తుందని, ఇలాంటి షూస్ ని తెలంగాణ వాసులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ షూస్ ని http://earthentunes.in అనే వెబ్ సైట్ లో కొనుక్కోవచ్చని చెప్పారు మంత్రి కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News