పవన్ కళ్యాణ్ కామెంట్స్‌పై మందకృష్ణ మాదిగ ఫైర్
ఏపీ హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని.. పవన్ మాదిగల వ్యతిరేకిని మందకృష్ణ మాదిగ అన్నారు
ఏపీలో ఎస్సీ వర్గీకరణ వేగవంతంగా చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, సీఎం చంద్రబాబును కోరారు. ఇవాళ ముఖ్యమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఒక కమీషన్ వేస్తానని సీఎం తెలిపారని కృష్ణ మాదిగ అన్నారు . కమీషన్ రిపోర్టు వచ్చి వర్గీకరణ జరిగే వరకూ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకూడదని విజ్ఞప్తి చేసాం. కమీషన్ రిపోర్టు వచ్చే వరకూ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వనని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. జస్టిస్ రామచంద్రరాజు కమీషన్ తీసుకున్న లెక్కలు ఇప్పుడు మారాయి. 2011 లెక్కలు పరిగణనలోకి తీసుకుని 15 నుంచి నెల రోజుల్లోనే నివేదిక వచ్చేలా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు అని మంద కృష్ణ మాదిగ తెలిపారు.
సార్వత్రి ఎన్నికలకు ముందు 32 అంశాలపై చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చామన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు మంద కృష్ణ మాదిగ కౌంటర్ ఇచ్చారు. పవన్ కామెంట్స్ బాధకరమన్నారు. మీ అభిప్రాయం ఎలా ఉన్నా.. లోపల మాట్లాడాలి. దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై మాట్లాడటం దురదృష్టకరమన్నారు.హోంమంత్రిని అంటే ప్రభుత్వాన్ని, సీఎంను అన్నట్టే. హోంమంత్రిని అనడమే కాదు.. సీఎంను కూడా పవన్ అన్నట్టే అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ మాదిగల వ్యతిరేకిన్నారు. అయితే నేను ఎన్నికలకు ముందే పవన్‌ని వ్యతిరేకించామని మందకృష్ణ అన్నారు . మాలలకు ఇచ్చిన ప్రాధాన్యత మాకు ఇవ్వని పవన్ సమాజిక న్యాయం గురించి ఎలా మాట్లాడతాడని ఆయన ప్రశ్నించారు