ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్‌ఐసీకి అప్పగింత
కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎన్‌ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉత్తర్వులు జారీ
Advertisement
ధరణి పోర్టల్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం ఎన్‌ఐసీ ((నేషనల్ ఇన్ఫర్‌మెటిక్స్ సెంటర్)కి అప్పగించింది. మూడేండ్ల నిర్వహణ కోసం ఆ సంస్థతో ఒప్పందాన్ని చేసుకున్నది. కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎన్‌ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని ఒప్పందంలో వెల్లడించింది. ధరణి పోర్టల్ నిర్వహణను ప్రైవేట్ సంస్థ టెరాసిస్ నుంచి ఎన్‌ఐసీకి బదలాయించింది. సాంకేతిక అంశాల్లో ఎన్‌ఐసీకి సహకరించాలని ప్రభుత్వం టెరాసిస్‌ను కోరింది. ఎన్‌ఐసీకి సహకరించడానికి ఈ నెలాఖరు వరకు గడువు విధించింది.
Advertisement