సిగరెట్‌ తాగినందుకు 8 రోజుల జైలు శిక్ష.. హైదరాబాద్‌లోనే.!

వంశీకృష్ణ సోదరులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులని.. ఇతను మాత్రం ఇంటర్‌తోనే చదువుకు స్వస్తి పలికి నిరుద్యోగిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. వంశీకృష్ణపై సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం- 2003 కింద కేసు నమోదు చేశారు.

Advertisement
Update:2023-12-30 11:37 IST

సిగరెట్‌ తాగినందుకు జైలుశిక్ష. వినడానికి షాకింగ్‌గా ఉందా..? అవును ఈ ఘటన హైదరాబాద్‌ రామ్‌గోపాల్‌ పేట్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీస్‌ స్టేషన్‌ ముందు సిగరెట్‌ తాగాడన్న కారణంగా స్థానిక కోర్టు 25 ఏళ్ల యువకుడికి 8 రోజుల జైలు శిక్ష విధించింది.

అసలేం జరిగిందంటే.. నిందితుడు వంశీకృష్ణ పోలీస్‌స్టేషన్ ముందు సిగరెట్‌ తాగుతూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ ర్యాప్‌ సాంగ్‌తో కూడిన వీడియోను తన సోషల్‌మీడియా ఖాతాలో అప్‌లోడ్‌ చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి రామ్‌గోపాల్‌పేట్ పోలీసుల దృష్టిలో పడింది. వెంటనే స్థానికులను ఈ వీడియోను చూపిస్తూ వంశీకృష్ణ గురించి ఆరా తీస్తూ అతన్ని పట్టుకున్నారు పోలీసులు.

వంశీకృష్ణ సోదరులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులని.. ఇతను మాత్రం ఇంటర్‌తోనే చదువుకు స్వస్తి పలికి నిరుద్యోగిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. వంశీకృష్ణపై సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం- 2003 కింద కేసు నమోదు చేశారు. తర్వాత ఈ-పెట్టి కేస్‌ కింద న్యాయవాది ముందు హాజరుపరచగా.. 8 రోజుల జైలుశిక్ష విధించారు. ఇక పోలీసులు సైతం వంశీకృష్ణకు ట్విస్ట్‌ ఇచ్చారు. అతని వీడియో అప్‌లోడ్‌ అయిన ఖాతాలోనే వంశీకృష్ణ అరెస్టుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. వంశీకృష్ణను చూసి ఇతరులు ఇలాంటి వీడియోలు చేయకూడదన్న ఉద్దేశంతోనే వీడియోను అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News