మాదిగలకు 9 కాదు 11 శాతం రిజర్వేషన్లు దక్కాలి : మందకృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు
ఎస్సీల వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ మందకృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యాయం జరిగిందని కృష్ణ మాదిగ ఆరోపించారు. వర్గీకరణ ద్వారా మాదిగలకు తమకు రావాల్సిన వాటా కంటే 2 శాతం తక్కువ రిజర్వేషన్లు వచ్చాయని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతు 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. 32 లక్షలు ఉన్న మాదిగలకు ఏ ప్రాతిపదికన తీసుకున్నా 11 శాతం రావాలి.
ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వేషన్ల పంపిణీలో లోపాలను సరిదిద్దాలి. మాకు రావాల్సిన దానికంటే 2 శాతం తక్కువ ఉన్నాయి’’ అని మందకృష్ణ మాదిగ అన్నారు. ఈనెల 7వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన 'లక్ష డప్పులు, వెయ్యి గొంతులు' కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు కృష్ణమాదిగ ప్రకటించారు. ఆ కార్యక్రమం స్థానంలో 15 రోజుల తర్వాత సాంస్కృతిక మహోత్సవంగా నిర్వహిస్తామని తెలిపారు.