నా ఇంట్లో కేసీఆర్‌, వైఎస్‌ ఫొటోలున్నాయ్‌!

నచ్చిన నాయకుల ఫొటోలు పెట్టుకుంటే తప్పేంది : ఎమ్మెల్యే దానం నాగేందర్‌

Advertisement
Update:2025-02-04 15:24 IST

తన ఇంట్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో పాటు కేసీఆర్‌ ఫొటోలు ఉన్నాయని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. నచ్చిన నాయకుల ఫొటోలు ఇంట్లో పెట్టుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే ఇంట్లో కేసీఆర్‌ ఫొటో పెట్టుకుంటే వివాదం సహా అనేక అంశాలపై దానం ఈ సందర్భంగా స్పందించారు. ఎవరి అభిమానం వాళ్లదని.. ఫొటోలు పెట్టుకోవడంలో తప్పేమి లేదని అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన నోటీసులు తనకు ఇంకా రాలేదని.. వచ్చిన తర్వాతే స్పందిస్తానని అన్నారు. హైడ్రా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. అధికారుల విషయంలోనూ అంతేనని అన్నారు. తాను కాంప్రమైజ్‌ కాలేదు.. కాబోను కూడా అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలోనూ అధికారుల విషయంలో తాను ఏ రోజూ కాంప్రమైజ్‌ కాలేదన్నారు. తనపై 173 కేసులు ఉన్నాయని చెప్పారు. అవసరమైతే జైలుకు పోతానే తప్ప పేదల ఇండ్లు కూల్చుతామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోనన్నారు.

Tags:    
Advertisement

Similar News