ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు.. ఎందుకంటే..?

ఈనెల 7న కరీంనగర్‌ బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్‌, గంగులతో పాటు కరీంనగర్ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Advertisement
Update:2024-03-11 11:03 IST

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డికి పోలీసులు షాకిచ్చారు. ఆయనపై కరీంనగర్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులనుద్దేశించి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆశిష్‌ గౌడ్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఈనెల 7న కరీంనగర్‌ బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్‌, గంగులతో పాటు కరీంనగర్ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కౌశిక్‌ రెడ్డి.. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తాం.. వడ్డీతో సహా ఇచ్చేస్తామంటూ కౌశిక్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవర్నీ వదిలిపెట్టబోమని.. ఎవరినైనా జైలుకు పంపిస్తాం అంటూ హెచ్చరించారు.


కౌశిక్‌ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న పురుషోత్తం, ఆశిష్‌ గౌడ్‌ కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు.

Tags:    
Advertisement

Similar News