హోలీ వేడుకల్లో డ్యాన్స్‌తో ఇరగదీసిన మల్లారెడ్డి

హోలీ వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్ డాన్స్‌తో అలరించారు.;

Advertisement
Update:2025-03-14 14:50 IST
హోలీ వేడుకల్లో డ్యాన్స్‌తో ఇరగదీసిన మల్లారెడ్డి
  • whatsapp icon

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి హోలీ సంబ‌రాల్లో తన డ్యాన్స్‌తో ఇరగదీశారు. హైద‌రాబాద్ బోయిన్‌ప‌ల్లిలోని త‌న నివాసం వ‌ద్ద మ‌ల్కాజిగిరి ఎమ్మెల్యే రాజ‌శేఖ‌ర్ రెడ్డితో క‌లిసి వేడుక‌ల్లో పాల్గొన్నారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలకు హోలీ పండుగ శుభాంక్షలు తెలిపారు. ఈనెల 19వ తేదీన 49 వ పెళ్లి రోజు అని సంతోషం వ్యక్తం చేశారు.

వచ్చే ఏడాది గోల్డెన్ జూబ్లీని పురస్కరించుకుని ఏడాదంతా దావత్ ఇస్తాని మల్లారెడ్డి పేర్కొన్నారు. కుటుంబ స‌భ్యులతో క‌లిసి రంగులు పూస్తూ, కాసేపు మ‌నుమ‌రాళ్ల‌ను త‌న భుజాల‌పై మోసుకొని మాజీ మంత్రి డ్యాన్స్ చేశారు. ఇలా స‌ర‌దాగా నృత్యం చేసి, డ‌ప్పు కొడుతూ స్థానికులు, పిల్ల‌ల‌ను ఆయ‌న‌ ఉత్సాహ‌ప‌రిచారు. మ‌ల్లారెడ్డి హోలీ సంబ‌రాల తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. మల్లారెడ్డి డ్యాన్స్‌ చేస్తున్న తీరు, డప్పు మోగిస్తూ పిల్లల్ని ఉత్సాహపరుస్తున్న తీరు చూసి నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ఆయన ఎనర్జీకి ఫిదా అయ్యారు. “ఇదే మల్లారెడ్డి స్టైల్”, “ఎప్పుడూ జోష్‌లోనే ఉంటారు”, “సర్‌కి డ్యాన్స్ అదుర్స్” అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News