కోడిపందాల కేసులో పోలీస్ విచారణకు హాజరైన పోచంపల్లి

ఫామ్‌హౌస్‌లో కోడి పందెం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు.;

Advertisement
Update:2025-03-14 15:15 IST
కోడిపందాల కేసులో పోలీస్ విచారణకు హాజరైన పోచంపల్లి
  • whatsapp icon

వ్యవసాయక్షేత్రంలో కోడి పందెం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ పోలీసులు ఆయన్ను వివిధ అంశాలపై విచారించారు. ఫిబ్రవరి11న తోల్కట్ట గ్రామ పరిధిలోని శ్రీనివాస్‌రెడ్డి ఫాంహౌస్‌పై ఎస్‌వోటీ, మొయినాబాద్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడి పందేలు ఆడుతున్న వారితో పాటు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటికే ఓసారి పోచంపల్లికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోచంపల్లిపై సెక్షన్‌-3 అండ్‌ గేమింగ్‌ యాక్ట్‌, సెక్షన్‌-11 యానిమల్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన అడ్వకేట్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్‌హౌస్‌ తనదేనని.. రమేష్‌ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన వెల్లడించారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు.

Advertisement

Similar News