మోదీని దించేసి అమిత్ షా ప్రధాని కావాలి -కేఏ పాల్

ప్రైవేటీకరణ పేరుతో దేశాన్ని మోదీ అమ్మేశారని మండిపడ్డారు. మోదీని దించేసి అమిత్ షా ప్రధాని కావాలన్నారు పాల్.

Advertisement
Update:2023-06-04 13:23 IST

కేఏ పాల్ వ్యాఖ్యలు కామెడీగానే ఉన్నా.. సందర్భానుసారం ఆయన కొన్నిసార్లు అదిరిపోయే పంచ్ లు పేలుస్తుంటారు. తాజాగా ఒడిశా రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేఏ పాల్. ప్రైవేటీకరణ పేరుతో దేశాన్ని మోదీ అమ్మేశారని మండిపడ్డారు. మోదీని దించేసి అమిత్ షా ప్రధాని కావాలన్నారు పాల్.

షా నా బెస్ట్ ఫ్రెండ్..

ఆమధ్య అమిత్ షా తో భేటీ అయిన కేఏ పాల్.. అప్పటినుంచి ఆయన్ను తన స్నేహితుడిగా చెప్పుకుంటున్నారు. అమిత్ షా చాలాకాలంగా చంద్రబాబుని దగ్గరకు రానీయలేదని, ఇప్పుడు జగన్ ని ఓడించేందుకు బాబే అమిత్ షా దగ్గరకు వెళ్లారని చెప్పుకొచ్చారు పాల్. చంద్రబాబుకి తాను గురువుని అని, 22 సార్లు ఆయన తలమీద చేయి పెట్టి ఆశీర్వదించానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు తో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ జాగ్రత్తగా ఉండాలని, వారికి ప్రమాదం పొంచి ఉందన్నారు.

ఇతర పార్టీ నాయకులంతా తనతో చేయి కలపాలని పదే పదే పిలుపునిస్తుంటారు కేఏపాల్. పవన్ కల్యాణ్ కి ఆయన చాలా సార్లు ఈ ఆఫర్ ఇచ్చారు. తాజాగా ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా ఇదే ఆఫర్ ఇచ్చారు. సొంతగా పొంగులేటి పార్టీ పెట్టి గెలవలేరని, ప్రజాశాంతి పార్టీలో చేరితే తాను సీఎం అవుతానని, పొంగులేటిని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పుకొచ్చారు. తెలంగాణకు సీఎం అయినా కూడా తాను కేవలం 6 నెలలు మాత్రమే ఆ కుర్చీలో ఉంటానని అన్నారు పాల్. లక్ష కోట్లు ఉన్న గాలి జనార్థన్ రెడ్డి కూడా కర్నాటకలో సక్సెస్ కాలేదని, అందరూ ఆ విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కర్నాటకలో తన మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికలకు ముందే తెలంగాణ కాంగ్రెస్ లో పదిమంది ముఖ్యమంత్రి అభ్యర్థులు బయలుదేరారని విమర్శించారు కేఏపాల్. 

Tags:    
Advertisement

Similar News