నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. సికింద్రాబాద్‌లో ఘటన

సికింద్రాబాద్‌ శామీర్‌పేట పరిధిలోని తూంకుంటలో నివాసం ఉంటే దేవేందర్‌, సరళ దంపతులు ఉదయం కంటోన్మెంట్ హాస్పిటల్‌లో చికిత్స కోసం బయల్దేరారు.

Advertisement
Update: 2024-05-21 08:43 GMT

సికింద్రాబాద్‌ పరిధిలోని తూంకుంటలో దారుణం జరిగింది. చికిత్స కోసం హాస్పిటల్‌కు బయల్దేరిన భార్యభర్తలకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి.

ఏం జరిగిందంటే..?

సికింద్రాబాద్‌ శామీర్‌పేట పరిధిలోని తూంకుంటలో నివాసం ఉంటే దేవేందర్‌, సరళ దంపతులు ఉదయం కంటోన్మెంట్ హాస్పిటల్‌లో చికిత్స కోసం బయల్దేరారు. అక‌స్మాత్తుగా ఓ భారీ వృక్షం బైక్‌పై వస్తున్న వీరిపై ప‌డింది. ఈ ప్రమాదంలో దేవేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన దేవేందర్‌ భార్యను స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. దేవేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.

అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన‌ వర్షాలకు చెట్టు వేర్లు తేలి ఒకవైపు వాలిందని.. అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం లేదని, వర్షాకాలంలో ఇలాంటి అనూహ్యమైన ప్రమాదాలు జరుగుతుంటాయని చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News