ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. పర్యాటక, చారిత్ర‌క ప్రాంతాలను విద్యార్థులు ఉచితంగా సందర్శించే అవకాశాం కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు

Advertisement
Update:2024-09-27 20:28 IST

 రాష్ట్రంలో సర్కార్ బడుల్లో చదువుకునే విద్యార్ధులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను, చారిత్రక కట్టడాలను ఫ్రీగా సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం ‘తెలంగాణ దర్శిని అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో టూరిస్ట్ ప్రదేశాల గురించి విద్యార్ధులకు అవగాహన కల్పించడానికి ఇది దోహద పడుతుందని సీఎం అన్నారు. విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని విషయాలను పాఠాలుగా వినడం కంటే ప్రత్యక్షంగా చూసి అనుభవించడం వల్ల ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారనే శాస్త్రీయ నిరూపణలున్న నేపథ్యంలో చారిత్ర‌క‌, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తలపెట్టారు.

రెండో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులను కేటగిరీలుగా విభజించి, ఆయా ప్రాంతాల్లోని పర్యాటక క్షేత్రాలను చూపిస్తారు. రవాణా, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వం రూ12.10 కోట్ల నిధులు విడుదల చేసింది. తొలి దశలో 1లక్ష మంది విద్యార్థులను పర్యాటక స్థలాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నోడల్ ఆఫీసర్లు నియమించే కమిటీలు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. తెలంగాణ దర్శినికి సంబంధించిన విధివిధానాలను జీవోలో పొందుపర్చారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల పునరుద్ధనకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగానే సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సచివాలయం వేదికగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. పురాతన కట్టడాలు కాపాడడమే లక్ష్యంగా సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం సైతం కుదుర్చుకుంది.

Tags:    
Advertisement

Similar News