పోలింగ్ కి ముందే బీఆర్ఎస్ కి గుడ్ న్యూస్..

విశేషం ఏంటంటే.. కాంగ్రెస్, బీజేపీకి కూడా అక్కడ ఆ స్థాయిలో పాజిటివ్ ఫలితాలు రాలేదు. రచ్చ గెలిచిన బీఆర్ఎస్, ఇక ఇంట గెలవడం పెద్ద విశేషమేమీ కాదంటున్నారు ఆ పార్టీ నాయకులు.

Advertisement
Update:2023-11-06 21:05 IST

తెలంగాణలో పోలింగ్ కి ముందే బీఆర్ఎస్ కి ఇది శుభవార్త అని చెప్పాలి. జాతీయ పార్టీగా అవతరించాలని చూస్తున్న బీఆర్ఎస్ కి మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. విశేషం ఏంటంటే.. కాంగ్రెస్, బీజేపీకి కూడా అక్కడ ఆ స్థాయిలో పాజిటివ్ ఫలితాలు రాలేదు. రచ్చ గెలిచిన బీఆర్ఎస్, ఇక ఇంట గెలవడం పెద్ద విశేషమేమీ కాదంటున్నారు ఆ పార్టీ నాయకులు.

మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఏకంగా 9 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకొని బోణీ కొట్టింది. భండారా జిల్లాలోని 66 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా 20 చోట్ల ఫలితాలు వచ్చాయి. ఇందులో బీఆర్ఎస్ 9 గ్రామ పంచాయతీల్లో గెలిచి సత్తా చాటింది. ఆ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి వరకు రెండు గ్రామ పంచాయతీలను మాత్రమే గెలుచుకున్నాయి. ఎన్సీపీ ఒక గ్రామ పంచాయతీలో విజయం సాధించింది. తెలంగాణ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ఈ విజయం మరింత ఉత్సాహాన్నిస్తుందని అంటున్నారు.

టీఆర్ఎస్‌ ను బీఆర్ఎస్‌ గా మార్చి సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం విస్తృతంగా మహారాష్ట్రలో పర్యటించి పార్టీని బలోపేతం చేశారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున అభ్యర్థులు బరిలో నిలిచారు. గణనీయమైన ఫలితాలు సాధించారు. 

Tags:    
Advertisement

Similar News