మోదీకి నాలుగు ఆప్షన్లు.. ట్విట్టర్లో కేటీఆర్ పంచ్ లు..

భారత్ లో చైనా చొరబాటుకి నిదర్శనంగా అక్కడ ఏకంగా ఓ గ్రామం నిర్మించినట్టు విడుదలైన శాటిలైట్ చిత్రాలను ట్వీట్ చేస్తూ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్.

Advertisement
Update:2022-07-20 12:05 IST

భారత్ లో చైనా చొరబాటుకి నిదర్శనంగా అక్కడ ఏకంగా ఓ గ్రామం నిర్మించినట్టు విడుదలైన శాటిలైట్ చిత్రాలను ట్వీట్ చేస్తూ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఇలాంటి ప్రధాన మంత్రిని ఏమని పిలవాలంటూ ప్రశ్నించారు కేటీఆర్. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేని ప్రధాని, దేశంలోకి వచ్చే చొరబాట్లను కూడా నియంత్రించలేని ప్రధానిని ఏమని సంబోధించాలో చెప్పాలని నెటిజన్లకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు.

ఆప్షన్-A 56ఇంచ్ ల ఛాతీ

ఆప్షన్-B విశ్వగురు

ఆప్షన్-C అచ్చేదిన్ వాలే

ఆప్షన్-D పైన ఉన్న పదాలన్నీ అన్ పార్లమెంటరీ కాబట్టి వాటిని తొలగించాం..

సింపుల్ గా ఇలా ప్రధాని పరువు తీసేశారు కేటీఆర్. ఓవైపు ద్రవ్యోల్బణం అరికట్టడం ప్రధానికి చేతకాలేదని, మరోవైపు దేశంలోకి చొరబాట్లను కూడా మోదీ అడ్డుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మీడియాలో వచ్చిన కథనాన్ని జత చేస్తూ ఆయన ఈ ట్వీట్ వేశారు. అటు చైనా చొరబాట్ల గురించి ప్రస్తావిస్తూనే ఇటు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని ఎత్తి చూపారు కేటీఆర్. విమర్శలకు భయపడి పార్లమెంట్ లో ఆయా పదాలను నిషేధించి తమ పరువు తామే తీసుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు కేటీఆర్.

ప్రస్తుతం చైనా చొరబాట్ల వ్యవహారం కేంద్రానికి తలనొప్పిగా మారింది. గతంలో చొొరబాట్లు లేవంటూ జబ్బలు చరుచుకున్న నేతలు, ఇప్పుడు శాటిలైట్ చిత్రాలకు ఏమని సమాధానం చెబుతారో చూడాలి. ఇది ప్రతిపక్షాల కుట్రేనని అంటారా..? లేక ఈ వ్యవహారాన్ని కూడా గత పాలకుల పాపమేనంటారా..? వేచి చూడాలి.



Tags:    
Advertisement

Similar News