ఐఏఎస్ అమోయ్ కుమార్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ

రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌ను ఈడీ ఏడున్నర గంటల పాటు విచారించింది.

Advertisement
Update:2024-10-23 19:10 IST

రంగారెడ్డి జిల్లాలో భూకేటాయింపుల అక్రమలపై మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌ను సుదీర్ఘంగా ఈడీ ఏడున్నర గంటల పాటు విచారించింది. అమోయ్ గతంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించినపుడు.. మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై ప్రధానంగా ఈడీ విచారణ సాగింది.

రూ. వందల కోట్ల విలువైన ల్యాండ్ కేవలం రూ. 42 కోట్లకే గత ప్రభుత్వ నేతలకు కట్టబెట్టడంపై ఈడీ పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.కాగా తమను బెదిరించి తమ భూములు బలవంతంగా లాక్కున్నారని స్థానిక రైతులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగా అధికారులు అమోయ్ కుమార్ ను విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఉదయం 8 గంటలకు మీడియా కంటపడకుండా బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు.

Tags:    
Advertisement

Similar News