ఈ-వేస్ట్ మానవాళికి అతిపెద్ద సవాలు : మంత్రి కేటీఆర్
ఈ-వేస్ట్‌ను సరైన పద్దతిలో నిర్వహిస్తే పర్యవరణాన్ని పరిరక్షించడమే కాకుండా.. అనేక విలువైన లోహాలను రీసైకిల్ చేసే అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) మానవాళికి అతిపెద్ద సవాలుగా పరిణమించింది. దేశంలో ఏటా 20 లక్షల టన్నుల ఈ-వేస్ట్ పోగవుతోందని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఎలక్ట్రానిక్ వేస్ట్ నిర్వహణ, రీసైక్లింగ్‌లో దేశంలోనే తొలిసారి మిషన్ ఈ-వేస్ట్ పేరుతో సెలెక్ట్ మొబైల్స్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఉపయోగించని లేదా సరిగా పని చేయని ఎలక్ట్రానిక్ పరికరాలను సరైన రీతిలో నిర్వహించకుండా.. ఇంట్లోనే దాచి పెట్టుకుంటున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మన దేశంలో ఈ-వేస్ట్ గురించి చాలా మందికి సరైన అవగాహన ఉండటం లేదు. ఈ క్రమంలో మిషన్ ఈ-వేస్ట్ కార్యక్రమాన్ని సెలెక్ట్ మొబైల్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఐటీ కారిడార్లు, మాల్స్, బస్టాప్‌లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రుల వంటి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో వ్యూహాత్మకంగా ఈ-వేస్ట్ బిన్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాము. ఇందుకు సెలెక్ట్ సంస్థ సహకరించాలని మంత్రి కోరారు. ఈ-వేస్ట్‌ను సరైన పద్దతిలో నిర్వహిస్తే పర్యవరణాన్ని పరిరక్షించడమే కాకుండా.. అనేక విలువైన లోహాలను రీసైకిల్ చేసే అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
సెలెక్ట్ కంపెనీ సీఎండీ వై.గురు మాట్లడతుతూ.. పనికి రాని ఎలక్ట్రానిక్ వస్తువులను సెలెక్ట్ రీటైల్ స్టోర్లకు తీసుకొని వస్తే.. కస్టమర్లకు రూ.1 వెయ్యి నుంచి రూ.10వేల వరకు డిస్కౌంట్ కూపన్ అందిస్తామనిచ ెప్పారు. ఈ కూపన్ కాలపరిమితి ఆరు నెలల కాలం ఉంటుందని పేర్కొన్నారు. మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్ పీసీలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను డిపాజిట్ చేయడం ద్వారా ఈ డిస్కౌంట్ కూపన్లు పొందవొచ్చని అన్నారు. అన్ని సెలెక్ట్ ఔట్‌లెట్‌లలో ప్రత్యేకంగా ఈ-వేస్ట్ బిన్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.