భట్టి వర్సెస్ రేణుక.. ఖమ్మం కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
రేణుకా చౌదరి వ్యాఖ్యలపై భగ్గుమన్నారు భట్టి వర్గీయులు. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు వచ్చి నీతులు చెప్పొద్దంటూ రేణుకా చౌదరిపై మండిపడ్డారు.
ఖమ్మం కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ సారి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఖమ్మంలో ఇవాళ నిర్వహించిన మీటింగ్‌లో మాట్లాడిన రేణుకా చౌదరి.. పదవులు కావాలి.. కానీ మీటింగ్‌లకు రారు అంటూ భట్టిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేశారు.
రేణుకా చౌదరి వ్యాఖ్యలపై భగ్గుమన్నారు భట్టి వర్గీయులు. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు వచ్చి నీతులు చెప్పొద్దంటూ రేణుకా చౌదరిపై మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి, తుమ్మల సమక్షంలోనే ఈ గొడవ జరగడం గమనార్హం.
ఇక రేణుకాచౌదరి, భట్టి విక్రమార్క చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. భట్టిని టార్గెట్ చేసుకుని చాలాసార్లు రేణుకాచౌదరి నేరుగానే విమర్శలు చేశారు. ఎంపీ ఎన్నికల వేళ బహిరంగంగా ఇలా విభేదాలు బయటపడడం ఖమ్మం జిల్లా పాలిటిక్స్‌లో చర్చనీయాంశమైంది.