కవితకు మళ్లీ నిరాశే.. జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్టు చేసింది. రేపటితో కవిత అరెస్టయి రెండు నెలలు పూర్తి కానుంది.
Advertisement
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు. ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 8 వేల పేజీలతో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఐతే ఈ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలా, వద్దా అనే అంశంపై ఈనెల 20న విచారణ చేపడతామని స్పష్టం చేసింది కోర్టు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్టు చేసింది. రేపటితో కవిత అరెస్టయి రెండు నెలలు పూర్తి కానుంది. ఇక ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటీవల బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.
Advertisement