కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం కేంద్రంగా పని చేస్తోంది : కిషన్ రెడ్డి
దేశంలో కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం కేంద్రంగా పని చేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు
ఓబీసీల అభ్యున్నతి కోసం కర్పూరి ఠాకూర్ విశేషమైన సేవలు అందించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ డైరీని కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతు దేశంలో కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం కేంద్రంగా పని చేస్తోందని ఆయన అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో నిశ్శబ్ధ విప్లవం వచ్చిందని అన్నారు. దళిత నేతలపై కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచే కక్ష కట్టిందని ఆరోపించారు.
నాడు హిందీ భాష వ్యాప్తి కోసం కర్పూరి ఠాకూర్ ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని.. బిహార్‌కు రెండు సార్లు సీఎంగా వ్యహరించారని గుర్తు చేశారు నేడు రాజ్యాంగం గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగించ లేదని అన్నారు. మదర్ ఆప్ డెమొక్రసీ అంటే భారత్ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని గుర్తు చేశారు. అంబర్‌పేట నియోజకవర్గం తులసీరాం నగర్ (లంక) ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ మంత్రి కిషన్ రెడ్డి పంపిణీ చేశారు.