ORR లీజు.. ఆమ్రపాలికి రేవంత్ కీలక బాధ్యతలు
ORR నిర్వహణ పూర్తిగా IRB ఇన్‌ఫ్రా చేతుల్లోకి వెళ్లింది. టోల్ ద్వారా వచ్చే ఆదాయం కూడా ఆ సంస్థకే లభించనుంది. ప్రస్తుతం ఔటర్‌పై నిత్యం సుమారు 1.3 లక్షల నుంచి 1.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లపై సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ORR టోల్ టెండర్లలో అవకతవకలపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈమేరకు ORR టోల్ టెండర్ల పూర్తి వివరాలు సమర్పించాలని HMDA జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించిన విచారణ బాధ్యతను CBI లేదా మరో సంస్థకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
హైదరాబాద్‌కు మణిహారమైన 158 కిలోమీటర్ల నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం IRB ఇన్‌ఫ్రా అనే ప్రైవేట్ సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. టోల్ వసూలు, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిన లీజుకు అప్పగించింది. మొత్తం రూ.7,380 కోట్లకు ఈ లీజును ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది.
ఇక ORR నిర్వహణ పూర్తిగా IRB ఇన్‌ఫ్రా చేతుల్లోకి వెళ్లింది. టోల్ ద్వారా వచ్చే ఆదాయం కూడా ఆ సంస్థకే లభించనుంది. ప్రస్తుతం ఔటర్‌పై నిత్యం సుమారు 1.3 లక్షల నుంచి 1.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ORRను లీజుకు ఇవ్వడంపై ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. అక్రమాలు జరిగాయన్నారు. తాజాగా దీనిపై విచారణకు ఆదేశించారు.