గుంటూరు, గుడివాడ, ఇంగ్లీష్.. సీఎం రేవంత్ స్పీచ్
తనకు ఇంగ్లీష్ రాదని కొందరు అవహేళన చేస్తున్నారన్నారు రేవంత్. తాను జిల్లా పరిషత్ స్కూల్‌లో తెలుగుమీడియం చదివానన్నారు.
అభివృద్ధికి ఇంగ్లీష్ ఆటంకం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో లెక్చరర్లు, టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన 5,192 మందికి నియామక పత్రాలను అందించారు. చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఇంగ్లీష్ రాకుండానే ప్రపంచంతో పోటీపడుతున్నారని చెప్పారు. మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు రేవంత్.
తనకు ఇంగ్లీష్ రాదని కొందరు అవహేళన చేస్తున్నారన్నారు రేవంత్. తాను జిల్లా పరిషత్ స్కూల్‌లో తెలుగుమీడియం చదివానన్నారు. గుంటూరు, గుడివాడకు వెళ్లి కార్పొరేట్ స్కూళ్లలో చదువుకోలేదన్నారు. వందలాది గురుకులాలు నిర్మించామంటున్న గత పాలకులు వసతులు కల్పించడంలో ఫెయిల్ అయ్యారన్నారు రేవంత్.
తెలంగాణ సాధనలో నిరుద్యోగులు, యువత పాత్ర గొప్పదన్నారు. వారి త్యాగాలు, బలిదానాలతోనే స్వరాష్ట్రం సాకారమైందన్నారు. కుటుంబ పాలనలో యువత ఆకాంక్షలు నెరవేరలేదంటూ ఆరోపించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పదవులు ఊడితేనే.. ఉద్యోగాలు వస్తాయని యువత భావించారన్నారు.