మెట్రోపై రేవంత్ రెడ్డి రివ్యూ..కొత్త రూట్లు ఇవే.!

ఇక ప్రస్తుతం ఉన్న మెట్రో కారిడార్‌ పొడిగింపు ప్లాన్‌ను సిద్ధం చేయాలని HMRL అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మార్గాల్లో మెట్రో పొడిగింపు అంశాన్ని అధికారులు పరిశీలించనున్నారు.

Advertisement
Update:2024-01-03 01:57 IST

హైదరాబాద్ మెట్రో రెండో దశ, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఓల్డ్ సిటీ మెట్రో రైల్ స్ట్రెచ్‌లో దారుల్‌షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్‌ వరకు మతపరమైన నిర్మాణాలకు ఇబ్బంది కలగకుండా రహదారిని విస్తరించడం వల్ల సిటీలోని ఇతర ప్రాంతాలతో సమానంగా ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. రాయదుర్గ్‌- ఎయిర్‌పోర్టు మెట్రో ప్లాన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. విస్తృతమైన ఔటర్ రింగ్ రోడ్‌ అందుబాటులో ఉన్నందుకు ఆ మార్గంలో మెట్రో అవసరం లేదని చెప్పినట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం ఉన్న మెట్రో కారిడార్‌ పొడిగింపు ప్లాన్‌ను సిద్ధం చేయాలని HMRL అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మార్గాల్లో మెట్రో పొడిగింపు అంశాన్ని అధికారులు పరిశీలించనున్నారు.

- మియాపూర్ - చందానగర్‌- BHEL - పటాన్‌చెరు - 14 కి.మీ

- MGBS - ఫలక్‌నుమా - చాంద్రాయణగుట్ట - మైలార్‌దేవ్‌పల్లి - P7 రోడ్‌ - ఎయిర్‌పోర్ట్ - 23 కి.మీ

- నాగోల్‌ - ఎల్బీనగర్‌ - ఓవైసీ హాస్పిటల్‌ - చాంద్రాయణ గుట్ట - మైలార్‌దేవ్‌పల్లి- ఆరాంఘర్‌- న్యూ హైకోర్టు సైట్‌ రాజేంద్రనగర్‌ - 19 కి.మీ

- రాయ్‌దుర్గ్‌ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు కారిడార్ - III పొడిగింపు వయా బయోడైవర్సిటీ జంక్షన్‌, IIIT జంక్షన్. ISB రోడ్‌ - 12 కి.మీ

- ఎల్బీ నగర్‌ - వనస్థలిపురం - హయత్‌నగర్‌ - 8 కి.మీ

ఇక మెట్రో ఫేజ్‌ - IIIలో భాగంగా జేబీఎస్ మెట్రో స్టేషన్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు, పారడైస్‌ మెట్రో నుంచి కండ్లకోయ/ మేడ్చల్ వరకు కవర్ చేయనున్నారు. ఫార్మాసిటీ కోసం ఇప్పటికే సేకరించిన భూముల్లో చేపట్టే మెగా టౌన్‌షిప్‌ కోసం శ్రీశైలం హైవే మీదుగా ఎయిర్‌పోర్టు నుంచి కందుకూరు వరకు మెట్రో కనెక్టివిటీని ప్లాన్ చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News