కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.

Advertisement
Update:2024-11-26 16:43 IST

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తన ఇంటికి వచ్చిన ముఖ్యమంత్రికి రామ్మోహన్ నాయుడు ఎదురొచ్చి, కౌగిలించుకుని ఆత్మీయంగా కేంద్రమంత్రి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఎంపీలు కడియం కావ్యా, చామల కిరణ్ కమార్‌రెడ్డి, రఘురామిరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రఘువీర్‌రెడ్డి పాల్గోన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నేడు ఆయ‌న ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై ముఖ్యమంత్రి చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా తెలంగాణ‌ పెండింగ్ అంశాల‌పై, విభ‌జ‌న హామీల‌పై మంత్రుల‌తో చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల‌తో సీఎం సమావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్ లో చ‌ర్చించాల్సిన అంశాల‌పై ఎంపీల‌కు దిశా నిర్దేశం చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News