తెలంగాణ మళ్లీ బీఆర్ఎస్‌దే.. CSDS- లోక్ నీతి అంచనా.!

ఇండియా టుడే ఛానల్‌లో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ నిర్వహించిన చర్చలో ఫేమస్‌ సెఫాలజిస్టు CSDS డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాబోతుందన్నారు.

Advertisement
Update:2023-09-30 17:26 IST

తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచాయి. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌, బీజేపీ కంటే ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌..మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 90 నుంచి 100 స్థానాల్లో విజయం సాధిస్తామని జోస్యం చెప్పారు.

తాజాగా ఇండియా టుడే ఛానల్‌లో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ నిర్వహించిన చర్చలో ఫేమస్‌ సెఫాలజిస్టు CSDS డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాబోతుందన్నారు. లోక్‌నీతి నేషనల్‌ కోఆర్డినేటర్‌ సందీప్ శాస్త్రి సైతం సంజయ్‌ కుమార్ మాటను బలపరిచారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు. ఈ రెండు పార్టీల కంటే అధికార బీఆర్ఎస్ పార్టీ ముందుందన్నారు. దీంతో బీఆర్ఎస్‌ కార్యకర్తలు ఈ వీడియోను విరివిగా షేర్‌ చేస్తున్నారు.

మరోవైపు ఇవాళ ఖమ్మంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దక్షిణ భారతంలో ఇప్పటివరకూ ఎన్టీఆర్ సహా ఏ ముఖ్యమంత్రి హ్యాట్రిక్‌ కొట్టలేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్ చరిత్రను తిరగరాయడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి సౌత్ ఇండియాలో హ్యాట్రిక్‌ కొట్టిన ఫస్ట్ సీఎంగా కేసీఆర్ చ‌రిత్ర‌ సృష్టించడం ఖాయమన్నారు.

Tags:    
Advertisement

Similar News