రజతోత్సవ వేడుకలకు ముందు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

పార్టీ ప్లీనరీ, ప్రతినిధుల సభ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం

Advertisement
Update:2025-02-19 13:25 IST

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సికింద్రాబాద్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి వెళ్లారు. తన పాస్‌పోర్టును రెన్యువల్‌ చేయించుకున్నారు. పాస్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి కేసీఆర్‌ నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లారు. సుమారు 7 నెలల విరామం తర్వాత కేసీఆర్‌ అక్కడి వెళ్లారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేళ భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్లీనరీ, ప్రతినిధుల సభ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుతోపాటు ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి తెచ్చేలా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు ఈ సమావేశంపై ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. 2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. కేసీఆర్‌ నాయకత్వాన్ని జారవిడచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి పట్టాలు తప్పి కకావికలం అవుతున్న సందర్భం నెలకొన్నది. రైతులు, మహిళలు, వృద్ధులు, పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగం, కార్మికులు ఇలా సబ్బండ వర్గాలు మళ్లీ బీఆర్‌ఎస్‌ గొడుగు కోసం ఎదురుచూస్తున్న వాతావరణం నెలకొన్నది. ఇటువంటి తరుణంలో కేసీఆర్‌ 'ఏం చెప్తారు?' అని ప్రజల్లో ఆసక్తి నెలకొనగా, రాజకీయ నాయకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రంలో రేవంత్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద నేటి విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వైఫల్యాల ను ఎండగట్టేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్రంగా చర్చించి పార్టీ అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఇచ్చి న హామీలను సాధించుకుంటూ, తమ హకులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై ఈ సమావేశంలో కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News