అయ్యయ్యో కృష్ణా యాదవ్.. బీఆర్ఎస్సే కాదు బీజేపీ కూడా హ్యాండిచ్చిందా..?
బీజేపీలో చేరడానికి ఆ పార్టీ కీలక నేతలు కిషన్‌రెడ్డి తదితరులను సంప్రదించి, బుధవారం ముహూర్తం పెట్టుకున్నారు కృష్ణాయాదవ్. నాంపల్లి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి చేరాలనుకున్నారు. కానీ, పార్టీ నేతలెవరూ స్పందించలేదు.
సి.కృష్ణా యాదవ్.. ఈ పేరు నేటి యువతకు తెలిసి ఉండకపోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పని చేసిన రాజకీయ నేత. టీడీపీ నేతగా హైదరాబాద్ నగర రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే స్టాంపు పేపర్ల కుంభకోణంలో చిక్కి, ప్రతిష్ట మసకబారిన కృష్ణా యాదవ్ దాదాపు ఇరవై ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో లేరు. ఈసారి టికెట్ కోసం బీజేపీలో చేరడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ నేతలు ఆయనకు హ్యాండిచ్చారు.
బీఆర్ఎస్ టికెట్ దక్కక బీజేపీ వైపు చూపు
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, హిమాయత్‌నగర్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సి.కృష్ణాయాదవ్ 2003లో వేల కోట్ల రూపాయల నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో అరెస్టయ్యారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అప్పటికి అదే అతిపెద్ద స్కామ్. దీంతో టీడీపీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ కేసు నుంచి విముక్తి పొందాక 2016లో టీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఈసారి ఆ పార్టీ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ర్యాలీకి ఏర్పాట్లు.. కానీ స్పందించని అగ్రనేతలు
బీజేపీలో చేరడానికి ఆ పార్టీ కీలక నేతలు కిషన్‌రెడ్డి తదితరులను సంప్రదించి, బుధవారం ముహూర్తం పెట్టుకున్నారు కృష్ణాయాదవ్. నాంపల్లి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి చేరాలనుకున్నారు. కానీ, పార్టీ నేతలెవరూ స్పందించలేదు. ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చెన్నమనేని విద్యాసాగర్‌రావు వారసుడు వికాస్ దంపతులు వచ్చి పార్టీలో చేరితే సాదరంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, సంజయ్ తదితరులు కృష్ణాయాదవ్‌కు మాత్రం స్పందించలేదు. చూడబోతే బీఆర్ఎస్‌తోపాటు బీజేపీ కూడా కృష్ణాయాదవ్‌కు కూడా హ్యాండిచ్చిందా అనే పరిస్థితి కనిపిస్తోంది.
*