చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడి
చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉన్న సమయంలో తనపై దాడి చేశారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై బెదిరింపులకు పాల్పడడాన్ని టెంపుల్స్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్ కన్వీనర్ డాక్టర్ ఎంవీ సౌందర్ రాజన్ ఖండించారు. ఈ మేరకు ఇవాళ ఆయన విడుదల చేశారు. ఫిబ్రవరి 7న తన కుమారుడు రంగరాజన్‌పై కొందరు బెదిరింపులకు పాల్పడినట్లు సౌందర్ రాజన్ తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై తన కుమారుడు రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సౌందర్ రాజన్ వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరపాలని సౌందర్‌రాజన్ కోరారు. చిలుకూరి బాలాజీ ఆశీస్సులతోనే తన కుమారుడు క్షేమంగా బయటపడ్డాడడని తెలిపారు. రంగరాజన్ చిలుకూరు పై దాడి చేసిన రామ రాజ్యం సంస్ధకు సంబందించిన వ్యక్తులని తెలుస్తోంది.ఆలయ బాధ్యతలు అప్పగించి తమ సంస్థలో చేరాలని రంగరాజన్ ను బెదిరించారని సమాచారం దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన రంగరాజన్ గారిపై దాడిని రెండు రోజులు అవుతున్నా బయటకు రాకుండా గోప్యంగా ఉంచడం పై అనుమానాలు రేకెత్తుతున్నాయి