స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి దుర్మరణం
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది.
Advertisement
రంగారెడ్డి జిల్లా అంబర్‌పేట్‌లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ వ్యాను కింద పడి రిత్విక అనే నాలుగేళ్ల చిన్నరి మృతి చెందింది. హయత్‌నగర్‌లో ఓ ప్రవేటు స్కూల్‌లో రిత్విక ఎల్‌కేజీ చదువుతోంది. బాలిక స్కూల్ బస్సు దిగి వెళ్తుండగా డ్రైవర్ బస్సును రివర్స్ చేశాడు. బాలిక రోడ్డు దాటుతున్న విషయాన్ని గమనించకుండా బస్సును రివర్స్ చేయడంతో వెనక టైర్ల కింద పడి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement