ఛాంపియన్స్‌ ట్రోఫీలో బంగ్లా- భారత్ ఢీ

బంగ్లాదేశ్‌పై భారీ విజయం నమోదు చేయాలని భావిస్తున్న భారత్‌

Advertisement
Update:2025-02-20 10:43 IST

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో తొలి మ్యాచ్‌కు భారత్‌ సిద్ధమైంది. గ్రూప్‌ఏలో ఉన్న భారత్‌ గురువారం దుబాయి వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనున్నది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌తో చేదు అనుభవాలు ఎదురైనా ఇంగ్లాండ్‌తో టీ20 తో పాటు వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌తో జోరుమీదున్న టీమిండియా బంగ్లాదేశ్‌పై భారీ విజయాన్ని నమోదు చేయాలని కృత నిశ్చయంతో ఉన్నది. అయితే ఇంగ్లాండ్‌తో పోలిస్తే గ్రూప్‌ఏలో ఉన్న పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు గట్టి సవాల్‌ ఎదురుకానున్నది. అయినా నాకౌట్‌కు చేరాలంటే టీమిండియాకు ప్రతీ మ్యాచ్‌ కీలకంగా మారింది. మూడు మ్యాచ్‌లో ఒక్కటి ఓడినా సెమీస్‌కు చేరడం కష్టంగా మారనున్నది. కొంతకాలంగా పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమవుతున్న సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఇంగ్లాండ్‌ సిరీస్‌తో గాడీలో పడ్డట్లే కనిపించింది. రోహిత్‌ సెంచరీతో, కోహ్లీ హాఫ్‌ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చారు. వీరిద్దరూ ఛాంపియన్స్‌ ట్రోఫీలో సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 5 రికార్డులు సాధించే అవకాశం ఉన్నది. 11 వేల రన్స్‌ మైలురాయిని హిట్‌మ్యాన్‌ అందుకోనున్నారు. అలాగే ఈ టోర్నీ ఫలితం ఎలా ఉన్నా వన్డే ఫార్మాట్‌లో ఈ ఇద్దరు సీనియర్లు కొనసాగడటం కష్టమే అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News