భారత బౌలర్ల దాటికి బంగ్లా టాప్‌ ఆర్డర్‌ విలవిల

35 పరుగులకే ఐదు వికెట్లు

Advertisement
Update:2025-02-20 15:35 IST

చాంపియన్స్‌ ట్రోఫీలో టాస్‌ గెలిచిన ఉత్సాహం బంగ్లాదేశ్‌ ను ఎంతోసేపు నిలువనివ్వలేదు. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్లు విలవిల్లాడారు. 35 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయారు. చాంపియన్స్‌ ట్రోఫీలో దుబయి క్రికెట్‌ స్టేడియం వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో భారత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో వెంటవెంటనే వికెట్లు పడగొట్టారు. మహ్మద్‌ షమీ వేసిన మొదటి ఓవర్‌లోనే సౌమ్యా సర్కార్‌ ను డకౌట్‌గా పెవిలియన్‌ కు ,చేర్చారు. ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో సైతం పరుగులేమి చేయకుండానే హర్షిత్‌ రాణా బౌలింగ్‌ లో ఔటయ్యాడు. మెహది హసన్‌ మిరాజ్‌ ఐదు పరుగులకు, ముస్తఫిజుర్‌ రహమాన్‌ పరుగులేమి చేయకుండానే ఔటయ్యారు. బంగ్లా బ్యాట్స్‌మన్లలో తంజీద్‌ హసన్‌ ఒక్కరే రెండంకెల స్కోర్‌ చేశారు. 25 పరుగులు చేసిన హసన్‌ ను అక్షర్‌ పటేల్‌ పెవిలియన్‌కు పంపాడు. బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్లలో తౌహిద్‌ హృదయ్‌ 10, జాకిర్‌ అలీ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లాదేశం 12 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా, అక్షర్‌ పటేల్‌ రెండు ఓవర్లలో నాలుగు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు నేలకూల్చాడు. హర్షిత్‌ రాణా నాలుగు ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి వికెట్‌ దక్కించుకున్నాడు.

Tags:    
Advertisement

Similar News