శుభ్‌మన్ గిల్ సెంచరీ..భారత్ విజయం

దుబాయ్ వేదికగా బాంగ్లదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

Advertisement
Update:2025-02-20 21:58 IST

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా దుబాయ్ వేదికగా బాంగ్లదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భారత బ్యాటర్‌ శుభ్‌మన్ గిల్ సెంచరీ చేశాడు, 129 బంతుల్లో గిల్ 101 రన్స్ చేశాడు.కేఎల్ రాహుల్ 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ మంచి ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు ఇద్దరు కలిసి 69 పరుగులు చేశారు. వరుస ఫోర్లతో స్కోర్‌ బోర్డును పరుగులెత్తించిన రోహిత్‌ శర్మ భారీ షాట్‌కు యత్నించి అవుట్‌ అయ్యాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ 49.4 ఓవర్లలో 228 పరుగులకు అలౌటైంది. తౌహీద్‌ హృదోయ్‌ సెంచరీ చేశాడు. మరో బంగ్లా బ్యాటర్ జాకర్ అలీ 68 పరుగులతో రాణించాడు. దీంతో బంగ్లా మెరుగైన స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లలో మ‌హ‌మ్మ‌ద్ షమీ 5 వికెట్ల, హర్షిత్ రాణా 3, అక్షర్ పటేలు 2 వికెట్లు తీశారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హాస్స్‌న్ 2 వికెట్లు, టస్కిన్, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు.

Tags:    
Advertisement

Similar News