టాస్ ఓడిన భారత్.. బంగ్లా బ్యాటింగ్‌

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

Advertisement
Update:2025-02-20 14:18 IST

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటివరకు బంగ్లాతో భారత్‌ 41 వన్డేలు ఆడగా.. 32 మ్యాచ్‌ల్లో గెలిచి, 8 ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దుబాయ్‌లో గత రెండు రోజులుగా వర్షం కురుస్తుండడంతో వికెట్‌ బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది. మ్యాచ్‌ కోసం తాజాగా సిద్ధం చేసిన వికెట్‌లను ఉపయోగిస్తారని సమాచారం. ఆకాశం మేఘావృతమై ఉన్నా.. వర్ష ఛాయలు తక్కువని వాతావరణ శాఖ తెలిపింది

భారత్‌ జట్టు 

రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్, కోహ్లి, శ్రేయస్, హార్దిక్, రాహుల్‌, అక్షర్‌ పటేల్, జడేజా, కుల్‌దీప్, షమి, హర్షిత్‌

బంగ్లాదేశ్‌ జట్టు  హసన్‌, సౌమ్య సర్కార్‌, నజ్ముల్‌ హొస్సేన్‌ షంటో (కెప్టెన్‌), తౌహిద్‌ హ్రిదయ్‌, ముష్ఫికర్‌ రహీమ్‌ (వికెట్‌ కీపర్‌), మహ్మదుల్లా, మెహ్దీహసన్‌, రిషద్‌ హొస్సేన్‌, టస్కిన్‌, ముస్తాఫిజుర్‌, నహీద్‌ రాణా.

Tags:    
Advertisement

Similar News