దంచికొట్టిన డకెట్‌.. ఇంగ్లాండ్‌ రికార్డ్ స్కోర్‌

ఛాంపియన్స్‌ టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం

Advertisement
Update:2025-02-22 18:51 IST

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 రన్స్‌ చేసింది. టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (165: 143 బాల్స్‌లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. జో రూట్‌ (68) రాణించాడు. ఫిల్‌ సాల్ట్‌ (10), జెమీ స్మిత్‌ (15) త్వరగానే పెవిలియన్‌ చేరడంతో ఇంగ్లాండ్‌ 43 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రూట్‌తో కలిసి డకెట్‌ ఇన్సింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 158 రన్స్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 95 బాల్స్‌లోనే సెంచరీ చేసిన డకెట్‌.. మరో 39 బాల్స్‌లో 150 రన్స్‌ మార్క్‌ అందుకున్నాడు. జోస్‌ బట్లర్‌ (23), లివింగ్‌స్టన్‌ (14) రన్స్‌ చేయగా.. హ్యారీ బ్రూక్‌ (3) నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో డ్వారిషూస్‌ 3, ఆడమ్‌ జంపా 2, లబుషేన్‌ 2, మ్యాక్స్‌ వెల్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

చరిత్ర సృష్టించిన బెన్‌ డకెట్‌

ఈ ఇన్నింగ్స్‌లో బెన్‌ డకెట్‌ చరిత్ర సృష్టించాడు. ఛాంపిన్స్‌ ట్రోఫీలో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు నాథన్‌ ఆస్ట్లే (న్యూజిలాండ్‌ పేరిట ఉండేది. ఆస్ట్లే 2004 ఛాంపియన్‌ ట్రోఫీలో యూఎస్‌ఏపై 177 బాల్స్‌లో 145 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోర్లు

  • 351/8.. ఇంగ్లాండ్ (ఆస్ట్రేలియాపై, 2025)
  • 347/4.. న్యూజిలాండ్ (యూఎస్ఏపై, 2004)
  • 338/4.. పాకిస్థాన్ (భారత్ పై, 2017)
  • 331/7.. భారత్ (దక్షిణాఫ్రికాపై, 2013)

Tags:    
Advertisement

Similar News