ధర్మశాలలో డబుల్ సెంచరీ చేస్తే.. డాన్ బ్రాడ్‌మన్ సరసన జైస్వాల్
1930లో ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ 134కి పైగా యావరేజ్‌తో 974 పరుగులు సాధించాడు.
ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. 5 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు చేశాడు జైస్వాల్. ధర్మశాలలో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌లో కూడా డబుల్ సెంచరీ కొడితే ఒకే సిరీస్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన డాన్ బ్రాడ్‌మన్ సరసన చేరతాడు.
93 ఏళ్ల రికార్డు
1930లో ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ 134కి పైగా యావరేజ్‌తో 974 పరుగులు సాధించాడు. ఐదు టెస్ట్‌ల ఆ సిరీస్‌లో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు బాదాడు. ఆ తర్వాత 93 ఏళ్లు గడిచినా ఏ ఒక్కరూ ఆ రికార్డును చేధించలేకపోయారు.
దిగ్గజాలకే సాధ్యం కాని రికార్డు
సచిన్, ద్రవిడ్, పాంటింగ్, సంగక్కర, జయవర్ధనే లాంటి ఆల్‌టైం గ్రేట్ బ్యాట్స్‌మన్లకే అందని ఈ రికార్డు ఇప్పుడు యశస్వి ముందు ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో జైస్వాల్ డబుల్ సెంచరీ కొడితే డాన్ బ్రాడ్‌మన్ అంతటి క్రికెట్ గ్రేట్ సరసన నిలబడే అత్యంత అరుదైన గౌరవం దక్కుతుంది.