జర్నలిస్టులతో విరాట్ కోహ్లీ వాగ్వాదం..ఎందుకంటే?

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో జర్నలిస్టులతో విరాట్ కోహ్లీ వాగ్వాదానికి దిగారు.

Advertisement
Update:2024-12-19 14:59 IST

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో స్థానిక మీడియా ప్రతినిధులతో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వాగ్వాదానికి దిగారు. ఆసీస్ పేస్ బౌలర్ స్కాట్ బోలాండ్‌ను ఎయిర్‌పోర్ట్‌లో కొందరు జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తుండగా.. భార్య అనుష్క శర్మ, పిల్లలు అకాయ్‌, కుమార్తె వామికలతో కలిసి కోహ్లీ అటువైపు నుంచి వచ్చాడు. ఈ క్రమంలో మీడియా కోహ్లీ కుటుంబం ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించింది. దీంతో విరాట్‌కి ఒక్కసారిగా పట్టలేనంత కోపమొచ్చింది.

ఫొటోలు ఎందుకు తీశారని వారితో గొడవకి దిగాడు. ‘నా పిల్లల విషయంలో నాకు కొంత గోప్యత కావాలి. నన్ను అడగకుండా మీరు ఫొటోలు తీయొద్దు’ అని కోహ్లీ జర్నలిస్టులతో అన్నాడు. ఓ మీడియా ప్రతినిధి దగ్గరకు వెళ్లి ఆ ఫొటోలు, వీడియోలు చూపించాలని కోరాడు. తన ఫ్యామిలీ సంబంధించిన ఏవైనా ఫొటోలు, వీడియోలు ఉంటే డిలీట్ చేయాలని సూచించాడు. కోహ్లీ తన పిల్లల గోప్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. సోషల్ మీడియాలో వారి ఫొటోలను పోస్ట్ చేస్తే ముఖాలు కనిపించకుండా ఎమోజీలు ఉంచుతాడు.

Tags:    
Advertisement

Similar News