ప్రపంచ ఫుట్ బాల్ లో అపూర్వఘట్టం!

ఫుట్ బాల్ ప్రపంచంలో గొప్పగొప్ప ఆటగాళ్లంతా ఒక్కచోట చేరితే.

Advertisement
Update:2023-01-20 10:00 IST

ఫుట్ బాల్ ప్రపంచంలో గొప్పగొప్ప ఆటగాళ్లంతా ఒక్కచోట చేరితే..వారికి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు చెబితే, నిజంగా అది అరుదైన, అపూర్వఘట్టమే.

ఆ అసాధారణ కలయికకు సౌదీ అరేబియా రాజధాని రియాద్ వేదికగా నిలిచింది...

ఫుట్ బాల్ చరిత్రలోనే ఓ అపూర్వఘట్టం గల్ఫ్ గడ్డ సౌదీ అరేబియా వేదికగా చోటు చేసుకొంది. ప్రస్తుత ప్రపంచ ఫుట్ బాల్ అత్యత ఖరీదైన , నలుగురు సూపర్ స్టార్లు..రెండుజట్ల తరపున బరిలో నిలిచారు. రియాద్ కు చెందిన అల్-నాజర్ క్లబ్, పారిస్ సెయింట్- జెర్మెయిన్ జట్ల మధ్య ఓ ఎగ్జిబిషన్ సాకర్ మ్యాచ్ నిర్వహించారు.

ఈ మ్యాచ్ ప్రారంభకార్యక్రమంలో బాలీవుడ్ దిగ్గజం, ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన అతిథిగా హాజరై రెండుజట్ల స్టార్ ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇటు రొనాల్డో..అటు లియోనెల్ మెస్సి

ఖతర్ లోని ఓ భాగ్యవంతుడికి చెందిన పారిస్ సెయింట్ -జెర్మెయిన్ క్లబ్ జట్టు సభ్యులుగా లయనల్ మెస్సీ,కిల్యాన్ ఎంబప్పే, నైమర్, హకీమ్ బరిలోకి దిగితే..సౌదీ అరేబియా షేక్ గారి క్లబ్ అల్ -నాజర్ క్లబ్ జట్టుకు క్రిస్టియానో రొనాల్డో నాయకత్వం వహించాడు.

260 లక్షల డాలర్ల తో నిర్వహించిన ఈ సహాయక సాకర్ మ్యాచ్ కు రియాద్ స్టేడియం కిటకిటలాడి పోయింది.

క్రిస్టియానో రొనాల్డో డబుల్ కిక్...

పారిస్ సెయింట్ జెర్మెయిన్- రియాద్ లెవెన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో మెస్సీనాయకత్వంలోని పారిస్ జట్టు విజేతగా నిలిస్తే...ఓడినజట్టు తరపున క్రిస్టియానో రొనాల్డో మ్యాజిక్ చేశాడు.

ఉత్కంఠభరితంగా సాగిన ఈమ్యాచ్ లో పారిస్ జట్టు 5-4 గోల్స్ తో రియాద్ లెవెన్ పై విజేతగా నిలిచింది. రియాద్ లెవెన్ తరపున క్రిస్టియానో రొనాల్డో రెండుగోల్స్ సాధించడం ద్వారా రెండుగోల్స్ సాధించాడు.

37 సంవత్సరాల వయసులోనూ రొనాల్డో ఆట మొదటి భాగానికి ముందే రెండుగోల్స్ నమోదు చేశాడు.

ఆట రెండో భాగంలో పారిస్ క్లబ్ తరపున ఎంబప్పే, హ్యూగో చెరో గోలు సాధించారు. సౌదీగడ్డపై రొనాల్డో ఆడిన తొలిమ్యాచ్ లోనే రెండుగోల్స్ తో ఈ మ్యాచ్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

2500 కోట్ల రూపాయలకు రెండున్నరేళ్లపాటు..సౌదీ క్లబ్ అల్ నాజర్ కు ఆడుతున్న సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News