జర్మనీ వేదికగా 2024 యూరో హంగామా షురూ!

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రీడాపండుగ యూరోపియన్ సాకర్-2024 టోర్నీకి జర్మనీ వేదికగా తెరలేచింది. ఫుట్ బాల్ అభిమానులకు వచ్చే నాలుగువారాలు ఇక పండుగే పండుగ.

Advertisement
Update:2024-06-15 12:39 IST

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రీడాపండుగ యూరోపియన్ సాకర్-2024 టోర్నీకి జర్మనీ వేదికగా తెరలేచింది. ఫుట్ బాల్ అభిమానులకు వచ్చే నాలుగువారాలు ఇక పండుగే పండుగ.

నాలుగు సంవత్సరాలకు ఓసారి జరిగే ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్, ప్రపంచ ఫుట్ బాల్ చాంపియన్షిప్ తరువాత..మూడో అతిపెద్ద క్రీడాసంబరం..యూరోపియన్ ఫుట్ బాల్ టోర్నీకి జర్మనీ వేదికగా తెరలేచింది.

యూరోప్ లోని 24 అగ్రశ్రేణిజట్లు ఆరు గ్రూపులుగా తలపడనున్న గ్రూపులీగ్ కమ్ సెమీఫైనల్స్ నాకౌట్ టోర్నీకి జులై 15న జరిగే ఫైనల్స్ తో తెరపడనుంది.

ఆతిథ్య జర్మనీ శుభారంభం...

జర్మనీ, స్కాట్లాండ్, స్విట్జర్లాండ్, హంగెరీ జట్లతో కూడిన పూల్- ఏ ప్రారంభమ్యాచ్ లో మూడుసార్లు విజేత జర్మనీ 5-1 గోల్సుతో స్కాట్లాండ్ ను చిత్తు చేయడం ద్వారా శుభారంభం చేసింది.

మ్యూనిచ్, కొలోన్, స్టుట్ గార్ట్ నగరాలు వేదికలుగా పూల్- ఏ లీగ్ మ్యాచ్ లు జరుగనున్నాయి. 2006 పిఫా ప్రపంచకప్ తరువాత జర్మన్ గడ్డపై జరుగుతున్న అతిపెద్ద క్రీడాసంరంభం ఇదే కావటం విశేషం.

' గ్రూప్ ఆఫ్ డెత్' లో హేమాహేమీజట్ల పోరు...

స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ లాంటి హేమాహేమీజట్లతో పాటు అల్బేనియా కూడా ఉన్న పూల్- బీ లీగ్ ను గ్రూప్ ఆఫ్ డెత్ గా పరిగణిస్తున్నారు. జూన్ 15 నుంచి 25 వరకూ బెర్లిన్, డోర్ట్ మండ్, హాంబర్గ్, జల్సెన్ కిర్చెన్, లీప్ జిగ్ నగరాలు వేదికలుగా గ్రూప్ ఆఫ్ డెత్ మ్యాచ్ లు జరుగనున్నాయి. మాజీ చాంపియన్లు ఇటలీ, స్పెయిన్, క్రొయేషియాజట్ల నడుమ పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.

పూల్- సీ లీగ్ లో స్లవేనియా, డెన్మార్క్, సెర్బియా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. స్టుట్ గార్ట్, మ్యూనిచ్, ఫ్రాంక్ ఫర్డ్, జల్సెన్ కిర్చెన్ , కలోన్ నగరాలు వేదికలుగా పూల్- సీ మ్యాచ్ లు నిర్వహిస్తారు.

పూల్ - డీ లీగ్ లో మాజీ చాంపియన్ నెదర్లాండ్స్, పోలాండ్, ఆస్ట్ర్రియా, ఫ్రాన్స్ జట్లు తలపడతాయి.

పూల్-ఇ లీగ్ లో రొమానియా, ఉక్రెయిన్, బెల్జియం, స్లవేకియాజట్లు, పూల్-ఎఫ్ లో టర్కీ, జార్జియా, పోర్చుగల్, చెక్ రిపబ్లిక్.

జూన్ 29 నుంచి నాకౌట్ దశ పోటీలు...

జూన్ 25న గ్రూప్ లీగ్ పోటీలు ముగియడంతో..నాలుగురోజుల విరామం తరువాత జూన్ 29 నుంచి 16 జట్ల ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ పోరు ప్రారంభంకానుంది.

జూన్ 5 నుంచి జులై 7 వరకూ క్వార్టర్ ఫైనల్స్, జులై 10 నుంచి 11 వరకూ సెమీఫైనల్స్ నిర్వహిస్తారు. జులై 15న టైటిల్ పోరు జరుగనుంది.

యూరోపియన్ కప్ ఫుట్ బాల్ పోటీలను సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రత్యక్షప్రసారం చేయనుంది.

పోర్చుగల్ ఎవర్ గ్రీన్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, ఫ్రెంచ్ డైనమైట్ కిల్యాన్ ఎంబప్పే, జూడే బెల్లింగ్ హామ్ ఈటోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు రెండో యూరోకప్ కు తహతహలాడుతుంటే..జర్మనీ నాలుగుసారి విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. అయితే ..సాకర్ పండితులు మాత్రం ఫ్రాన్స్ ను హాట్ ఫేవరెట్ గా పరిగణిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News