ఫీజు విషయంలోనే తేడా వచ్చి ఉండొచ్చు!
పంత్ ను ఢిల్లీ రిటైన్ చేసుకోకపోవడంపై గవాస్కర్
ఢిల్లీ క్యాపిటల్ టీమ్ మేనేజ్మెంట్ తమ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన రిషబ్ పంత్ ను రిటైన్ చేసుకోలేదు. ఈనెల 24, 25 తేదీల్లో జరిగే మేగా వేలంలో ఉన్న స్టార్ ప్లేయర్లలో రిషబ్ పంత్ ఒకరు. పంత్‌ను మెగా వేలంలో దక్కించుకోవాలని పంజాబ్, చెన్నై, బెంగళూరు టీమ్ లు భారీ మొత్తం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పంత్ ఎపిసోడ్ పై రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ టీమ్ మేనేజ్మెంట్ పంత్ కు చెల్లించే ఫీజు విషయంలో విభేదించి ఉండొచ్చని.. మెగా వేలంలో పంత్ వదులుకోవడానికి ఢిల్లీ మేనేజ్మెంట్ సిద్ధంగా ఉండకపోవచ్చని తెలిపారు. పంత్ ను తిరిగి దక్కించుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నిస్తుందని తెలిపారు. గవాస్కర్ కామెంట్స్ పై 'ఎక్స్' వేదికగా రిషబ్ పంత్ రియాక్ట్ అయ్యారు. తన రిటైన్షన్ అంశం డబ్బుతో ముడిపడి లేదని చెప్పారు.