టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం వెల్లడించాడు.

Advertisement
Update:2024-09-26 21:15 IST

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ హసన్ అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పాడు. భారత్‌తో కాన్పూర్ వేదికగా రేపటి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షకిబ్ ఈ ప్రకటన చేశాడు. 2026 టీ20 వరల్డ్ కప్ రీత్యా యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక బంగ్లాదేశ్‌లో మీర్‌పూర్ వేదికగా తన చివరి టెస్టు ఆడాలని భావిస్తున్నట్లు చెప్పాడు.

అయితే భద్రతా సమస్యలు తలెత్తితే రేపటి టెస్టు మ్యాచే తన ఆఖరి కావొచ్చని షకిబ్ పేర్కొన్నాడు. అక్టోబర్ 21 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ను బంగ్లాదేశ్ ఆడనుంది. అయితే బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. షేక్ హసీనా సర్కార్ రద్దు అవ్వడంతో తన ఎంపీ పదవినీ షకిబ్ కోల్పోయాడు. మరోవైపు షకిబ్‌పై మర్డర్ కేసు నమోదైంది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన రుబెల్ అనే యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 28వ నిందితుడిగా షకిబ్‌ ఉన్నాడు.

Tags:    
Advertisement

Similar News