టీమిండియా నిలబడితేనే ఓటమి నుంచి తప్పించుకునేది

మొదటి ఇన్నింగ్స్‌ లో 402 పరుగులకు కివీస్‌ ఆలౌట్‌

Advertisement
Update:2024-10-18 14:13 IST

న్యూజిలాండ్‌ తో మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ లో ఓటమి నుంచి తప్పించుకోవాలంటే టీమిండియా బ్యాట్స్‌ మెన్‌ వికెట్ల ముందు పాతుకు పోక తప్పని పరిస్థితి నెలకొంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ టెస్ట్‌ మ్యాచ్‌ లో మొదటి రోజు వర్షార్పణం అయ్యింది. రెండో రోజు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న భారత జట్టు కేవలం 46 పరుగులకే ఆలౌట్‌ అయి చెత్త రికార్డు క్రియేట్‌ చేసింది. కివీస్‌ ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. 67 పరుగల వద్ద కెప్టెన్‌ టాప్‌ లాథమ్‌ ఔట్‌ అయినా మరో ఓపెన్‌ దేవన్‌ కాన్వే విల్‌ యంగ్‌ తో కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. 33 పరుగులు చేసిన యంగ్‌ 142 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 180/3 వద్ద మూడో రోజు (శుక్రవారం) బ్యాటింగ్‌ ఆరంభించిన కివీస్‌ బ్యాటర్లు మరో 222 పరుగులు చేసి ఆలాట్‌ అయ్యారు. రచిన్‌ రవీంద్ర 157 బంతుల్లో 13 ఫోర్లు నాలుగు సిక్సర్లతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరలో టిమ్‌ సోథి 65 పరుగులతో రాణించాడు. కివీస్‌ బ్యాటర్లలో డేరెల్‌ మిచెల్‌ 18, గ్లెన్‌ ఫిలిప్స్‌ 14, బ్లండెల్‌ ఐదు, మ్యాట్ హెన్రీ 8, అజాజ్‌ పటేల్‌ నాలుగు పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా తలా మూడు వికెట్లు పడగొట్టారు. మహ్మద్‌ సిరాజ్‌ కు రెండు వికెట్లు దక్కాయి. జస్ప్రీత్‌ బూమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌ కు ఒక్కో వికెట్‌ దక్కింది. రెండో ఇన్నింగ్స్‌ లో భారత జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేస్తోంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ 22, యశస్వీ జైస్వాల్‌ 14 పరుగులతో క్రీజ్‌ లో ఉన్నారు. న్యూజిలాండ్‌ కన్నా భారత జట్టు 319 పరుగులు వెనుకబడి ఉంది. శుక్రవారం ఆటలో ఇంకో 40 ఓవర్లకు పైగా ఆట మిగిలి ఉంది. మొదటి టెస్టులో ఇంకా రెండున్నర రోజుల ఆట మిగిలి ఉండటంతో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో భారత జట్టు నిలకబడగా బ్యాటింగ్‌ చేస్తూ వికెట్లు ముందు పాతుకుపోకుంటే పరాజయం తథ్యమనే అంచనాలో క్రికెట్‌ అభిమానులు ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News