టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీకి పాక్‌ వెళ్లదు

తేల్చిచెప్పిన భారత విదేశాంగ శాఖ

Advertisement
Update:2024-11-29 17:02 IST

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా క్రికెటర్లు పాకిస్థాన్‌ కు వెళ్లబోరని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ శుక్రవారం ఈమేరకు అధికారిక ప్రకటన వెలువరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ ఆందోళనలో ఉందని, ఈ నేపథ్యంలో క్రికెటర్లను పాకిస్థాన్‌ కు పంపే అవకాశం లేదన్నారు. పాక్‌ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టీమిండియాను అక్కడికి పంపబోమని, హైబ్రిడ్‌ మోడల్‌ టోర్నీ నిర్వహిస్తేనే తాము చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొంటామని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీతో తేల్చిచెప్పింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా క్రికెటర్లను పాక్ పంపబోమని స్పష్టతనిచ్చింది. చాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ ఖరారుపై పాక్‌ క్రికెట్‌ బోర్డుతో శుక్రవారం సాయంత్రం ఐసీసీ సమావేశమైంది. ఇప్పటికే శ్రీలంక -ఏ జట్టు పాక్‌ టూర్‌ ను అర్ధాంతరంగా రద్దు చేసుకొని స్వదేశానికి తిరిగి వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీ నిర్వహణకు ఐసీసీ పట్టుబట్టే అవకాశముందని తెలుస్తోంది. దీనిపై ఒకటి, రెండు గంటల్లోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.

Tags:    
Advertisement

Similar News