టీమిండియా టార్గెట్‌ 95 రన్స్‌

భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్సింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 146 రన్స్‌కు ఆలౌట్‌

Advertisement
Update:2024-10-01 12:34 IST

కాన్పూర్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 146 రన్స్‌కు ఆలౌట్‌ అయ్యింది. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా బంతితో మ్యాచ్‌ను తిప్పేశారు. దీంతో బంగ్లా చివరి రోజు ఆటలో వరుసగా వికెట్లను కోల్పోయింది. అశ్విన్‌, జడేజా, బూమ్రా మూడేసి వికెట్లు తీయగా.. ఆకాశ్‌దీప్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. టీమిండియా లక్ష్యం 95 రన్స్‌.షద్మాన్‌ ఇస్లామ్‌ (50), ముష్ఫికర్‌ రహీమ్‌ (37) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో భారత్‌ ముందు 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా ఉంచింది. మొదటి ఇన్సింగ్స్‌లో బంగ్లా జట్టు 233 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత్‌  మొదటి ఇన్సింగ్స్‌లో వేగంగా బ్యాటింగ్‌ చేసి 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. మొదటి టెస్ట్‌లో గెలిచిన భారత్‌ రెండో టెస్ట్‌ మొదటి ఇన్సింగ్స్‌లోనూ బ్యాటింగ్‌తో అదరగొట్టింది. బంగ్లా నిర్దేశించిన 95 పరుగులను ఛేదిస్తే రెండు టెస్ట్‌ల ఈ సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసినట్లు అవుతుంది. 

అదరగొట్టిన భారత బౌలర్లు

ఓవర్‌ నైట్‌ 26/2 స్కోరుతో చివరిరోజు ఆటను మొదలుపెట్టిన బంగ్లాకు మొదట్లోనే ఎదురు దెబ్బతగిలింది. భారత బౌలర్లు రవి చంద్రన్‌ అశ్విన్‌ (3/50), రవీంద్ర జడేజా 3/34, జస్‌ప్రీత్‌ బూమ్రా 3/17, అకాశ్‌ దీప్‌ 1/20 దెబ్బకు బంగ్లాదేశ్‌ బ్యాటర్లు బెంబేలెత్తారు. మొదటి ఇన్సింగ్స్‌లో సెంచరీ చేసిన మొమినల్‌ హక్‌ను అశ్విన్‌ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కెప్టెన్‌ షాంటో (19) తో కలిసి షద్మాన్‌ ఇస్లామ్‌ (50) ఇన్సింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 55 రన్స్‌ చేశారు. భారత బౌలర్లు విజృంభించడంతో స్వల్ప వ్యవధిలోనే బంగ్లా వారిద్దరి వికెట్లను కోల్పోయింది. 34 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 109 రన్స్‌ చేసింది. ఆర్వాత 37 పరుగులకే మిగతా వికెట్లను కోల్పోయింది. ఆఖర్లో ముష్ఫికర్‌ రహీమ్‌ క్రీజ్‌లో పాతుకుపోయి కొంతసేపు భారత బౌలర్లను విసిగించాడు. ఎట్టకేలకు బూమ్రా అతడిని క్లీన్‌ బౌల్డ్‌ చేయడతో బంగ్లా ఇన్సింగ్స్‌కు తెరపడింది.

Tags:    
Advertisement

Similar News