తొలి ఇన్సింగ్స్‌లో 156 రన్స్‌కే టీమిండియా ఆలౌట్‌

కివీస్‌ స్పిన్నర్ శాంట్నర్‌ దెబ్బకు చేతులెత్తేసి భారత బ్యాటర్లు

Advertisement
Update:2024-10-25 12:58 IST

న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌ మొదటి ఇన్సింగ్స్‌లో టీమిండియా 156 రన్స్‌కు ఆలౌట్‌ అయ్యింది. రెండో రోజు 16/1తో ఆట ఆరంభించిన భారత్‌ తొలి సెషన్‌ ముగియకముందే మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్‌ గిల్‌ (30) శాంట్నర్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరుగగా.. ఆ తర్వాత వచ్చిన విరాట్‌ కోహ్లీ (1) శాంట్నర్‌ బౌలింగ్‌లోనే క్లీన్‌ బౌల్డ్‌ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం ఓపెనర్‌ జైస్వాల్‌ (30) కూడా పెవిలియన్‌ దారి పట్టాడు. మొదటి టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన కీపర్‌ రిషభ్‌ పంత్‌ (18) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. దీంతో 38 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 103 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. లంచ్‌ బ్రేక్‌ సమయానికి క్రీజ్‌లో రవీంద్ర జడేజా , వాషింగ్టన్‌ సుందర్‌ ఉన్నారు. లంచ్‌ అనంతరం కూడా పరిస్థితి మారలేదు. జడేజా (38), సుందర్‌ (18) కొంత నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీంతో స్వల్ప వ్యవధిలోనే మిగిలిన వికెట్లను సమర్పించుకున్నది. కివీస్‌ స్పిన్నర్లు శాంట్నర్‌ (7/53), గ్లేన్‌ ఫిలిప్స్‌ (2/26) దెబ్బకు ఈ సెషన్‌లో ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 103 పరుగల వెనుకంజలో ఉన్నది. 

Tags:    
Advertisement

Similar News