విజృంభించిన సుందర్..కివీస్ 259 పరుగులకే ఆలౌట్
పూణే వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్‌లో 259 పరుగులకే ఆలౌటైంది.
పూణే వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్‌లో 259 పరుగులకే ఆలౌటైంది. కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ ఔటయ్యాడు. వ్యక్తిగతం 15 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అశ్విన్ తన తొలి ఓవర్‌లోనే వికెట్ తీసుకున్నాడు. టాస్ గెలిచిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. తొలి వికెట్‌కు లాథమ్, కాన్వే 32 పరుగులు జోడించారు. ఇక మరో ఓపెనర్ డెవాన్ కాన్వే ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్టును పరుగులు పెట్టించేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలోనే అతడు 141 బంతుల్లో 76 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన విల్ యంగ్ 45 బంతుల్లో 18 పరుగులు చేసి పెవీలియన్‌కు చేరాడు. ఒక దశల్లో 197/4తో పటిష్ఠంగా ఉన్న కివీస్‌ను వాషింగ్టన్ సుందర్ వెన్ను విరిచాడు. మొత్తం 7 వికెట్ల తీసి కివీస్ ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర వహించారు. బ్లాక్ క్యాప్స్‌లో డెవాన్ కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ధసెంచరీలతో రాణించారు. సిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు.