ఆ 2 లాజిక్స్‌ రిపీట్‌ అయితే.. హైదరాబాద్‌దే కప్పు

ఆసీస్ ఆటగాళ్లు హైదరాబాద్‌ కెప్టెన్‌గా ఉంటే కప్పు మనదే అన్న సెంటిమెంట్‌ కూడా ఫ్యాన్స్‌ నుంచి వినిపిస్తోంది. ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడే 2009లో హైదరాబాద్‌ కప్పు గెలిచింది.

Advertisement
Update:2024-05-25 13:23 IST

క్వాలిఫైయర్‌-2లో రాజస్థాన్‌ రాయల్స్‌పై అద్భుత విజయంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. దీంతో రెండు లాజిక్స్‌ ఫ్యాన్స్‌ తెరపైకి తెచ్చారు. అవే గనుక రిపీట్‌ అయితే.. ఈసారి కప్పు మనదే అంటున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌ 2009, 2016లో రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీ కొట్టింది. మూడోసారి కప్పు కొట్టాలని ఉవ్విల్లూరుతోంది.

లాజిక్‌ నంబర్‌ 1...

2008లో హైదరాబాద్‌ డెక్కన్‌ ఛార్జర్స్‌ పేరుతో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సీజన్‌ ఆరంభంలోనే అత్యంత చెత్త ప్రదర్శనతో దారుణంగా విఫలమైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. కానీ.. నెక్ట్స్‌ ఇయర్‌కి కొత్త జెర్సీ, కొత్త లోగో, కొత్త కెప్టెన్‌, కొత్త టెంపర్‌మెంట్‌తో బరిలోకి దిగిన డీసీ.. సంచలనం సృష్టిస్తూ.. ఏకంగా ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ఇదే ఇప్పుడు సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కు సెంటిమెంట్‌గా మారింది. ఐపీఎల్‌ 2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఎడెన్‌ మార్కరమ్‌ కెప్టెన్సీలోని SRH.. పేలవ ప్రదర్శనతో దారుణంగా నిరాశరిచింది. ఐపీఎల్‌ 2024కు సన్‌రైజర్స్‌ కొత్త జెర్సీ, కొత్త కెప్టెన్‌, కొత్త యాటిట్యూడ్‌తో బరిలోకి దిగింది. అగ్రెసివ్‌ బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌తో ఐపీఎల్‌ చరిత్రనే తిరగరాసింది. అయితే.. ఐపీఎల్‌ 2008, 2009 ప్రకారం.. ఐపీఎల్‌ 2023లో టేబుల్‌లో చివర్లో ఉన్న సన్‌రైజర్స్‌.. ఈ సీజన్‌లో కప్పు కొట్టడం గ్యారెంటీ అని ఫ్యాన్స్‌ అంటున్నారు.

లాజిక్‌ నంబర్‌ 2...

ఆసీస్ ఆటగాళ్లు హైదరాబాద్‌ కెప్టెన్‌గా ఉంటే కప్పు మనదే అన్న సెంటిమెంట్‌ కూడా ఫ్యాన్స్‌ నుంచి వినిపిస్తోంది. ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడే 2009లో హైదరాబాద్‌ కప్పు గెలిచింది. అలాగే 2016లోనూ డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీలోనే SRH కప్పు కొట్టింది. ఇప్పుడు కమిన్స్‌ కూడా ఆస్ట్రేలియన్ ఆటగాడే హైదరాబాద్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇలా రెండు లాజిక్‌లుగానీ రిపీట్ అయితే మనదే కప్పు అంటున్నారు ఫ్యాన్స్. రేపు చెన్నై వేదికగా జరిగే ఫైనల్స్‌లో ఏం జరగబోతోందో చూడాలి మరి..

Tags:    
Advertisement

Similar News