సోఫీ డివైన్ అర్ధశతకం.. భారత్ టార్గెట్ ఎంతంటే?
మహిళల టీ20 వరల్డ్ కప్ తొలి పోరులో భారత జట్టుకు న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ సోఫీ డెవినె అర్ధశతకం అదరకొట్టింది
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ సోఫి డివైన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 160 రన్స్ చేసింది. సోఫీ డివైన్ (57; 36 బంతుల్లో 7×4) అర్ధశతకంతో ఆకట్టుకుంది. ఓపెనర్లు సుజియీ బేట్స్ (27), జార్జియా ప్లిమ్మెర్ (34) శుభారంభాన్నిచ్చారు. అమేలియా ఖేర్ (13) కాస్త నిరాశపరిచింది. క్రీజులోకి రాగానే కివీస్ బ్యాటర్లు వీర బాదారు.
అయితే, వీరి దూకుడుకు ఇండియా బౌలర్ అరుంధతిరెడ్డి అడ్డుకట్ట వేసింది. టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యాన్ని సొమ్ము చేసుకున్న డెవినె బలమైన షాట్లతో విరుచుకు పడింది. బ్రూక్ హల్లిడే(16)లతో నాలుగో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. దాంతో, న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ సేన బోణీ కొట్టాలంటే 8కి పైగా రన్‌రేటుతో ఆడాల్సి ఉంటుంది. రెండో డౌన్‌లో వచ్చిన సోఫీ క్రీజులో నిలదొక్కుకొని ఆడటంతో ఆ జట్టు మంచి స్కోరే చేసింది. బ్రుక్ హాలిడే (16) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత్ బౌలర్లలో రేణుకా ఠాకూర్ 2 వికెట్లు తీయగా, అరుంధతి రెడ్డి, ఆశా శోభన తలో వికెట్ తీశారు.