స్లో ఓవర్‌ రేట్‌.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ లకు పెనాల్టీ

ఐసీసీ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల లోనూ తప్పని కోత

Advertisement
Update:2024-12-03 17:15 IST

క్రైస్ట్‌చర్చ్‌ టెస్టులో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లకు మ్యాచ్‌ ఫీజుల్లో కోత పడింది. ఒక్కో టీమ్‌ మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధిస్తూ రెఫరీ నిర్ణయం తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఐసీసీ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్లలోనూ రెండు జట్లకు మూడేసి పాయింట్ల చొప్పున కోత విధించారు. మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 2 వరకు జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ టీమ్‌ 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది. డిసెంబర్‌ 6 నుంచి 10 వరకు వెల్లింగ్టన్‌ వేదికగా రెండో టెస్ట్‌, 14 నుంచి 18 వరకు హామిల్టన్‌ వేదికగా మూడో టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ పాయింట్స్‌ పర్సంటేజ్‌ సిస్టమ్‌ (పీసీటీ) 50తో నాలుగో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్‌ 43.75తో ఆరో స్థానంలో ఉంది. ఈ టేబుల్‌లో ఇండియా 61.11 పీసీటీతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సౌత్‌ ఆఫ్రికా 59.26 పీసీటీతో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 57.69 పీసీటీతో మూడో స్థానంలో ఉంది.

Tags:    
Advertisement

Similar News