ముగిసిన రెండోరోజు ఆట.. భారత్ 141 /6
33 బాల్స్‌లోనే 61 రన్స్ బాదిన రిషభ్ పంత్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు జరుగుతున్నది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా (8*), వాషింగ్టన్ సుందర్ (6*) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 145 రన్స్‌కు చేరింది. రిషబ్ పంత్ 61( 33 బాల్స్‌లోనే) అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. యశస్వి జైస్వాల్ (22) ఫర్వాలేదనిపించాడు. ఆరంభం నుంచి వీళ్లిద్దరూ దూకుడుగా ఆడారు. శుభ్‌మన్ గిల్ (13), కేఎల్ రాహుల్ (13) మంచి ఆరంభాలను వృథా చేసుకున్నారు. బోలాండ్ 4, కమిన్స్, వెబ్‌స్టర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మొదటి ఇన్సింగ్స్‌లో భారత్ 185 రన్స్ చేయగా.. ఆసీస్ 181 పరుగులకు ఆలౌటైంది.